

తిలక్ వర్మ అద్భుత ఇన్నింగ్స్‌తో ముంబయి ఇండియన్స్ కు కీలక విజయాన్ని అందించాడు. పంజాబ్ కింగ్స్ పై జరిగిన మ్యాచ్‌లో తిలక్ అజేయంగా 75 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఈ అద్భుత ప్రదర్శనకు గాను అతడికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. విల్ జాక్స్ తో కలిసి ఐదో వికెట్‌కు కేవలం 20 బంతుల్లోనే 56 పరుగులు జోడించి మ్యాచ్‌ను ముంబయి వైపు తిప్పేశాడు.
మ్యాచ్ అనంతరం తిలక్ మాట్లాడుతూ, చివరి వరకు క్రీజ్‌లో ఉండి మ్యాచ్‌ను ఫినిష్ చేయడం తనకు ఎంతో ఇష్టమని తెలిపాడు. ప్రపంచకప్, అంతర్జాతీయ మ్యాచ్‌ల నుంచి ఫినిషింగ్ కళను నేర్చుకున్నానని, అవే తనకు ఒత్తిడి పరిస్థితులను అర్థం చేసుకునే అనుభవాన్ని ఇచ్చాయని పేర్కొన్నాడు. పిచ్ చాలా నెమ్మదిగా స్పందించిందని, అందుకే చివరి వరకు మ్యాచ్‌ను తీసుకెళ్లాలని ముందే భావించామని చెప్పాడు. స్ట్రాటజిక్ టైమౌట్ సమయంలో జట్టుకు ఒక పెద్ద ఓవర్ అవసరమని కోచ్‌కు చెప్పానని, ఆ తర్వాత యుజ్వేంద్ర చాహల్ వేసిన ఓవర్లో 22 పరుగులు సాధించడం మ్యాచ్ టర్నింగ్ పాయింట్‌గా మారిందని వెల్లడించాడు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!