
జనరల్

తెలంగాణలో శాంతిభద్రతల పరిస్థితి పూర్తిగా దిగజారిపోయిందని భారత రాష్ట్ర సమితి నేత తన్నీరు హరీశ్‌రావు ఆరోపించారు. ముఖ్యమంత్రిగా మాత్రమే కాకుండా రాష్ట్ర గృహశాఖ మంత్రిగా కూడా రేవంత్‌రెడ్డి విఫలమయ్యారని విమర్శించారు. జాతీయ నేర గణాంకాల ప్రకారం 2024లో తెలంగాణలో 27,230 సైబర్ నేరాలు నమోదయ్యాయని, దేశంలోనే అత్యధిక సైబర్ నేరాలు నమోదవుతున్న రాష్ట్రంగా తెలంగాణ మారడం ఆందోళనకరమని అన్నారు.
మహిళల భద్రత విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. నగర పోలీసు అధికారుల ప్రత్యేక చర్యలతో హైదరాబాద్‌లో పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో బయటపడిందన్నారు. ఉన్నతస్థాయి సమీక్షలు నిర్వహించడం మాత్రమే కాకుండా, క్షేత్రస్థాయిలో శాంతిభద్రతల పరిరక్షణపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని సూచించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!