1, అక్టోబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పాల ఉత్పత్తుల కల్తీపై యూపీ సర్కారు కీలక నిర్ణయం

Writer: Sreekanth Reddy 12:56 AM, 17 ఆగస్టు, 2026
పాల ఉత్పత్తుల కల్తీపై యూపీ సర్కారు కీలక నిర్ణయం

ప్రజారోగ్యాన్ని కాపాడే దిశగా యూపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. పాలు, పాల ఉత్పత్తుల కల్తీకి పాల్పడే సంస్థలను మూసేసి, వాటి లైసెన్స్ రద్దు చేసేందుకు నిర్ణయించింది. ఆహార నాణ్యత నిబంధనలపై ఇటీవల ఎఫ్ఎస్‌డీఏ ఆదేశాలకు అదనంగా మరిన్ని కఠిన చర్యలు తీసుకునేందుకు యోగి సర్కారు నిర్ణయించింది.గతంలో కల్తీ ఉదంతాలు బయటపడిన సందర్భాల్లో ఆయా సంస్థల్లోని శాంపిల్స్ సేకరించి పరీక్షలకు పంపించేవారు. కేసులు నమోదు చేసేవారు. ఇందుకు అదనంగా ఇకపై పాలు, పాల ఉత్పత్తుల్లో హానికారక పదార్థాలు, నిషేధిత కొవ్వు పదార్థాలు ఉన్నట్టు ఆరోపణలు వస్తే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్-2006 సెక్షన్ 34 ప్రకారం సంబంధిత తయారీ యూనిట్‌లో తక్షణం కార్యకలాపాలను నిలిపివేస్తారు. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకూ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంస్థలు ఎలాంటి కార్యకలాపాలు చేపట్టకూడదు. ఆయా కేంద్రాల్లోని డెయిరీ ఉత్పత్తులు అన్నిటినీ సీజ్ చేస్తారు.

ఇక కల్తీ జరిగినట్టు, హానికారక పదార్థాలు ఉన్నట్టు నిర్ధారణ అయితే నిబంధనల ఉల్లంఘించిన సంస్థల లైసెన్స్‌ను రద్దు చేయడంతో పాటు ఆ బ్రాండ్ ఉత్పత్తుల విక్రయాలపై రాష్ట్రవ్యాప్త నిషేధం విధిస్తారు. పాల విక్రయాలు, పాల ఉత్పత్తుల నాణ్యత కచ్చితంగా నిబంధనలకు అనుగుణంగా ఉండాలని ఫుడ్ సేఫ్టీ కమిషనర్ డా. రోషన్ జేకబ్ స్పష్టం చేశారు.

ఇటీవల జరిగిన తనిఖీల సందర్భంగా పలు చోట్ల పాలు పాల ఉత్పత్తుల్లో నిషేధిత పదార్థాలు ఉన్నట్టు వెలుగులోకి వచ్చింది. రిఫైన్డ్ ఆయిల్, కొవ్వు, టాల్కమ్ పౌడర్, డిటర్జెంట్, టైటానియం డైయాక్సైడ్, హైడ్రోజన్ పెరాక్సైడ్ వంటివి బయటపడ్డాయి. ఈ నేపథ్యంలో ప్రజారోగ్యాన్ని కాపాడే దిశగా యోగి సర్కారు కఠిన చర్యలకు ఉపక్రమించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కెసిఆర్ ఆస్తులు పై శ్వేత పత్రం విడుదల చేయాలి - సీఎం రేవంత్

కెసిఆర్ ఆస్తులు పై శ్వేత పత్రం విడుదల చేయాలి - సీఎం రేవంత్

సెక్యూరిటీ కాన్వాయ్‌పై కేరళం సీఎం వి.డి. సతీశన్ కీలక ఆదేశాలు...

సెక్యూరిటీ కాన్వాయ్‌పై కేరళం సీఎం వి.డి. సతీశన్ కీలక ఆదేశాలు...

క్షుద్రపూజల ఆరోపణలపై నాంపల్లి కోర్టులో హరీశ్‌రావు స్టేట్‌మెంట్‌...

క్షుద్రపూజల ఆరోపణలపై నాంపల్లి కోర్టులో హరీశ్‌రావు స్టేట్‌మెంట్‌...

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు

గవర్నర్‌ను కలిసిన ఎంపీ రఘునందన్ రావు

గవర్నర్‌ను కలిసిన ఎంపీ రఘునందన్ రావు

ఉత్తరాంధ్ర సమస్యలపై విజయసాయిరెడ్డి ఫోకస్

ఉత్తరాంధ్ర సమస్యలపై విజయసాయిరెడ్డి ఫోకస్

ట్యాగ్లు
యూపీసీఎంయోగీ ఆదిత్య నాథ్కల్తీ పాలుకఠిన చర్యలుబీజేపీ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
స్థానిక ఎన్నికలకు జనసేన కొత్త ప్రణాళిక
జనరల్

స్థానిక ఎన్నికలకు జనసేన కొత్త ప్రణాళిక

కెసిఆర్ ఆస్తులు పై శ్వేత పత్రం విడుదల చేయాలి - సీఎం రేవంత్
రాజకీయాలు

కెసిఆర్ ఆస్తులు పై శ్వేత పత్రం విడుదల చేయాలి - సీఎం రేవంత్

బిగ్ బాస్ తెలుగు 10 డే 24 :కెప్టెన్సీ టాస్క్‌లో గొడవలు, ఎమోషన్స్
షోస్

బిగ్ బాస్ తెలుగు 10 డే 24 :కెప్టెన్సీ టాస్క్‌లో గొడవలు, ఎమోషన్స్

శిక్షణతోనే సమర్థ పోలీస్‌ నాయకత్వం -డీజీపీ సీవీ ఆనంద్
జనరల్

శిక్షణతోనే సమర్థ పోలీస్‌ నాయకత్వం -డీజీపీ సీవీ ఆనంద్

డ్రగ్స్ మాఫియాపై భారత భద్రతా బలగాల భారీ సర్జికల్ స్ట్రైక్...
జనరల్

డ్రగ్స్ మాఫియాపై భారత భద్రతా బలగాల భారీ సర్జికల్ స్ట్రైక్...

ఫ్రీ ఓటీటీ మూవీస్.. మైండ్ బ్లోయింగ్ ట్విస్టులతో మూడు సినిమాలు.. ఎక్కడ చూడాలంటే?
ఓటీటీ

ఫ్రీ ఓటీటీ మూవీస్.. మైండ్ బ్లోయింగ్ ట్విస్టులతో మూడు సినిమాలు.. ఎక్కడ చూడాలంటే?

వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం..
క్రీడలు

వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం..

వన్డే చరిత్రలో రోహిత్ శర్మ అరుదైన రికార్డు..
క్రీడలు

వన్డే చరిత్రలో రోహిత్ శర్మ అరుదైన రికార్డు..

ఆసియా క్రీడలను వీక్షించేందుకు జపాన్‌కు తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి బృందం...
క్రీడలు

ఆసియా క్రీడలను వీక్షించేందుకు జపాన్‌కు తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి బృందం...

చరిత్ర సృష్టించిన కెప్టెన్ శుభ్‌మన్ గిల్..
క్రీడలు

చరిత్ర సృష్టించిన కెప్టెన్ శుభ్‌మన్ గిల్..

23 ఏళ్ల తర్వాత ఇరాక్‌లో సార్వభౌమత్వ వేడుకలు..
జనరల్

23 ఏళ్ల తర్వాత ఇరాక్‌లో సార్వభౌమత్వ వేడుకలు..

సెక్యూరిటీ కాన్వాయ్‌పై కేరళం సీఎం వి.డి. సతీశన్ కీలక ఆదేశాలు...
రాజకీయాలు

సెక్యూరిటీ కాన్వాయ్‌పై కేరళం సీఎం వి.డి. సతీశన్ కీలక ఆదేశాలు...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!