

రాజస్థాన్‌లోని చిత్తోర్‌గఢ్‌లో జరిగిన బహిరంగ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జాతీయ గీతం ‘వందేమాతరం’ను కాంగ్రెస్ అవమానించిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో ‘వందేమాతరం’ ఆలాపన కొనసాగుతున్న సమయంలో దాన్ని మధ్యలోనే నిలిపివేయాలని పార్టీ నాయకత్వాన్ని సోనియా గాంధీ కోరారని షా ఆరోపించారు. ఈ ఘటనను దేశ ప్రజలు గమనించారని, 140 కోట్ల మంది ప్రజలు దీనిని ఎప్పటికీ క్షమించరని వ్యాఖ్యానించారు.
‘వందేమాతరం’ స్వాతంత్ర్య పోరాటంలో కీలక పాత్ర పోషించిందని అమిత్ షా పేర్కొన్నారు. ఈ గీతాన్ని ఆలపించినందుకు ఎంతోమంది స్వాతంత్ర్య సమరయోధులు లాఠీ దెబ్బలు, తుపాకీ గుళ్లు ఎదుర్కొని జైలుకు వెళ్లారని గుర్తుచేశారు. ఓటు బ్యాంకు రాజకీయాల కారణంగానే కాంగ్రెస్ ‘వందేమాతరం’ను విస్మరిస్తోందని ఆరోపించిన షా, కాంగ్రెస్ ప్రజలకు, గీత రచయిత బంకిమ్ చంద్ర ఛటోపాధ్యాయకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే, షా చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ నుంచి స్పందన రావాల్సి ఉంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!