
న్యూస్

2025 నవంబర్ 10 న ఢిల్లీ లోని ఎర్రకోట సమీపంలో చోటుచేసుకున్న పేలుడు దేశాన్ని కుదిపేసింది. ఈ ఘటనను ఉగ్రదాడిగా భారత మంత్రివర్గం అధికారికంగా ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో నిరపరాధుల ప్రాణనష్టంపై తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. బాధితుల స్మరణార్థం రెండు నిమిషాల మౌనం పాటించారు.
ఉగ్రవాదంపై ఏ రూపంలోనైనా రాజీ లేకుండా ఎదుర్కోవడమే ప్రభుత్వ విధానం అని కేబినెట్ మరోసారి స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో నిందితులపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. ప్రస్తుతం భారత్ ‘ఆపరేషన్ సిందూర్ 2.0’ రక్షణ విధానాన్ని అమలు చేస్తోంది. ఈ నేపథ్యంతో రక్షణ సంస్థలు తీసుకునే ప్రతిస్పందన చర్యలు ఎలా ఉండబోతాయో చూడాలి. ఢిల్లీ పేలుడు దేశ భద్రతపై ప్రభుత్వ సంకల్పాన్ని మరింత బలపరిచింది.








.avif&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!