
రాజకీయాలు

సామాజిక బాధ్యతను చాటుతూ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) తీసుకున్న నిర్ణయం ప్రశంసలు అందుకుంటోంది. ఎస్ఆర్హెచ్–రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ సందర్భంగా 30 మంది దివ్యాంగులకు ఉచిత కాంప్లిమెంటరీ పాసులు జారీ చేసి, స్టేడియంలో ప్రత్యక్షంగా మ్యాచ్ను వీక్షించే అవకాశం కల్పించింది. ఈ చర్యతో క్రీడలలో సమాన అవకాశాల ప్రాముఖ్యతను మరోసారి చాటింది.
మ్యాచ్ను ప్రత్యక్షంగా వీక్షించడం తమకు కొత్త అనుభూతి అని దివ్యాంగులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా హెచ్సీఏ కార్యదర్శి మన్నె జీవన్ రెడ్డి గ్యాలరీలో వారితో కలిసి కూర్చొని మ్యాచ్ను వీక్షిస్తూ, వారితో మమేకమై జట్టుకు మద్దతు తెలిపారు. ఆయన ఈ చర్యతో అందరి మనసులు గెలుచుకున్నారు.

















.webp&w=3840&q=75)




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!