
సినిమాలు

ప్రపంచంలో తొలి ఎయిర్ ట్యాక్సీ స్టేషన్ దుబాయ్లో సిద్ధమైంది. ఈ విషయాన్ని దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ తెలిపారు. ఈ స్టేషన్ను దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర నిర్మించారు, దీని వల్ల ప్రయాణికులకు సులభంగా రాకపోకలు సాగించడానికి సౌకర్యం కలుగుతుంది.
ఈ ఏడాది చివరి నాటికి ఈ ఎయిర్ ట్యాక్సీ స్టేషన్ ప్రజలకు అందుబాటులోకి రానుంది. సంవత్సరానికి సుమారు 1,70,000 మంది ప్రయాణికులు ప్రయాణించేందుకు అనుకూలంగా దీనిని రూపొందించారు. ఈ ప్రాజెక్ట్ వల్ల నగర రవాణా వ్యవస్థలో పెద్ద మార్పులు రావడంతో పాటు, దుబాయ్ స్మార్ట్ ట్రాన్స్పోర్ట్ రంగంలో మరింత ముందుకు వెళ్లనుంది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!