
న్యూస్

లింక్డిన్ ‘ఏఐ లేబర్ మార్కెట్‌ప్లేస్’ అనే కొత్త ఫీచర్‌ను పరీక్షిస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడళ్ల పనితీరును మెరుగుపరచడం లక్ష్యంగా ఈ ప్లాట్‌ఫామ్‌ను తీసుకొచ్చింది. కోడింగ్, ఫైనాన్స్, నర్సింగ్ వంటి రంగాల్లో నిపుణులు ఏఐ చాట్బాట్లతో కనెక్ట్ అవుతూ, వాటి సమాధానాలను సమీక్షించి మెరుగులు దిద్దే విధంగా పనిచేస్తున్నారు.
ప్రస్తుతం ప్రారంభ దశలో ఉన్న ఈ వ్యవస్థ, నిపుణులకు మంచి ఆదాయ అవకాశాలను అందిస్తోంది. తమ నైపుణ్యాన్ని బట్టి గంటకు రూ.3,300 నుంచి రూ.14,000 వరకు సంపాదించే అవకాశం ఉందని లింక్డిన్ తెలిపింది. ఈ కొత్త ప్రయత్నం ద్వారా ఏఐ రంగంలో కొత్త ఉద్యోగ అవకాశాలు పెరగడంతో పాటు, మరింత కచ్చితమైన మరియు సమర్థవంతమైన ఏఐ సాంకేతికత అభివృద్ధికి దోహదం అవుతుందని భావిస్తున్నారు.


















.webp&w=3840&q=75)



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!