
సినిమాలు

ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య దాడులు కొనసాగుతున్న వేళ పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, ఇజ్రాయెల్, ఖతార్ దేశాలకు వెళ్లే అన్ని విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ప్రకటించింది.
ఈ సస్పెన్షన్ను ఈరోజు రాత్రి 11.59 గంటల వరకు పొడిగించినట్లు సంస్థ వెల్లడించింది. ప్రయాణికులు తమ ప్రయాణ ప్రణాళికలను మార్చుకోవాలని, తాజా సమాచారాన్ని అధికారిక ప్రకటనల ద్వారా తెలుసుకోవాలని సూచించింది. ప్రాంతీయ భద్రతా పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.











.avif&w=3840&q=75)




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!