

‘తిమ్మరాజుపల్లి టీవీ’ ఒక ప్యూర్ సస్పెన్స్ డ్రామాగా ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. కిరణ్ అబ్బవరం తన కేఏ ప్రొడక్షన్స్ ద్వారా సుమైర స్టూడియోస్‌తో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సాయి తేజ్, వేద జలంధర్ హీరో హీరోయిన్స్‌గా పరిచయమవుతున్నారు. వి. మునిరాజు దర్శకత్వంలో గ్రామీణ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది.
దర్శకుడు వి. మునిరాజు మాట్లాడుతూ, ఈ కథ తన చిన్ననాటి అనుభవాలు, తాను చూసిన గ్రామ జీవితం ఆధారంగా రూపొందిందని తెలిపారు. గ్రామీణ భావోద్వేగాలు, మనుషుల సంబంధాలు, అహం వంటి అంశాలతో పాటు సస్పెన్స్ అంశాలు కలిపి సినిమా తీశామని చెప్పారు. జెన్ జీ ప్రేక్షకులకు కూడా కొత్త ప్రపంచాన్ని చూపించేలా సినిమా ఉంటుందని అన్నారు. చివరలో బలమైన ఎమోషనల్ కంటెంట్ ఉంటుందని వివరించారు.
తాను ఆన్లైన్ ఎడిటర్‌గా కెరీర్ ప్రారంభించి, తర్వాత డెమో ఫిల్మ్ చేసి కిరణ్ అబ్బవరానికి పరిచయం కావడంతో ఈ ప్రాజెక్ట్ మొదలైందని తెలిపారు. రియల్ లొకేషన్స్‌లో సహజమైన శైలిలో సినిమా తెరకెక్కించామని, సింగిల్ టేక్ సీన్స్ కూడా చేశామని చెప్పారు. కొత్త వాళ్లకు అవకాశం ఇచ్చిన కిరణ్ అబ్బవరానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సినిమా కొత్త టాలెంట్‌కు మార్గం చూపుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.





















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!