
సినిమాలు

టీవీకే పార్టీ అధ్యక్షుడు, నటుడు విజయ్ చెన్నైలోని పెరంబూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. అక్కడ పార్టీ కార్యాలయం ఏర్పాట్లు జరుగుతుండగా, ఇదే ఆయన ఎన్నికల కేంద్రంగా ఉండొచ్చని భావిస్తున్నారు.
ఆన్లైన్ సభ్యత్వంలో పెరంబూర్ నుంచి ఎక్కువగా నమోదు కావడం వల్ల, ఈ నియోజకవర్గాన్ని ఎంపిక చేసినట్టు సమాచారం. బుధవారం నుంచి ఇక్కడే విజయ్ ప్రచారం ప్రారంభించే అవకాశం ఉంది. రాష్ట్రంలోని 234 నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులను నిలబెట్టేందుకు టీవీకే సిద్ధమవుతోంది. తొలి దశలో కొంతమంది అభ్యర్థులతో ఇప్పటికే చర్చలు జరిపినట్లు సమాచారం. త్వరలో అభ్యర్థుల జాబితా ప్రకటించే అవకాశం ఉంది.



.jpg&w=3840&q=75)














.png&w=3840&q=75)



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!