
సినిమాలు

పెద్ది సినిమా షూటింగ్ సమయంలో రామ్ చరణ్‌కు గాయం అయ్యిందనే వార్తల పై చిత్రబృందం స్పందించింది. సెట్స్‌లో ఆయన కుడి కంటికి స్వల్ప గాయం అయినట్లు తెలిపింది. వెంటనే తగిన చికిత్స అందించడంతో ప్రస్తుతం ఆయన పూర్తిగా కోలుకున్నారని స్పష్టం చేసింది. ఈ విషయం పై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అభిమానులకు సూచిస్తూ, సోషల్ మీడియాలో వస్తున్న రూమర్లను నమ్మొద్దని చిత్రబృందం విజ్ఞప్తి చేసింది. గురువారం మార్చి 26 నుంచి రామ్ చరణ్ మళ్లీ షూటింగ్లో పాల్గొంటారని వెల్లడించింది.
ఇదిలా ఉండగా, రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ‘పెద్ది’ టీమ్ ప్రత్యేక సర్ప్రైజ్ ప్లాన్ చేసింది. మార్చి 27 న ఉదయం 11:07 గంటలకు ఒక స్పెషల్ వీడియోను విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈ అప్డేట్ను తెలియజేస్తూ కుస్తీ పోటీని సూచించే పోస్టర్‌ను కూడా విడుదల చేశారు.


.png&w=3840&q=75)





.webp&w=3840&q=75)










.png&w=3840&q=75)



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!