
న్యూస్

వాట్సాప్ త్వరలో పెద్ద మార్పులతో అప్డేట్ తీసుకురానున్నట్లు సమాచారం. ఫోన్ నంబర్ల స్థానంలో యూజర్ నేమ్స్, యునిక్ ఐడీలు అందుబాటులోకి రానున్నాయి. ఈ ఫీచర్ జూన్‌లో విడుదలయ్యే అవకాశం ఉంది. దీంతో ఫోన్ నంబర్ షేర్ చేయకుండా కొత్త ఫ్రెండ్స్, గ్రూప్స్‌తో సులభంగా కనెక్ట్ అవ్వొచ్చు.
ఇప్పటి విధానాన్ని కొనసాగించాలనుకునే వారికి ఫోన్ నంబర్లతోనే కొనసాగేందుకు ప్రత్యేక ప్రైవసీ ఆప్షన్ కూడా అందుబాటులో ఉండనుంది. దీనివల్ల వినియోగదారులకు తమ వ్యక్తిగత సమాచారంపై మరింత నియంత్రణ ఉంటుంది.
ఇక మరో కొత్త ఫీచర్‌గా ‘గెస్ట్ చాట్’ కూడా రానుందని సమాచారం. దీని ద్వారా వాట్సాప్ లేని వారితో కూడా చాట్ చేయగల అవకాశముంటుంది. ఈ మార్పులు యూజర్లకు మరింత సౌకర్యం మరియు ప్రైవసీని అందించేందుకు ఉద్దేశించినవిగా భావిస్తున్నారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!