

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఘర్షణల నేపథ్యంలో ప్రపంచం ఎన్నడూ లేనంత ఇంధన సంక్షోభ ముప్పును ఎదుర్కొంటోందని అంతర్జాతీయ ఇంధన సంస్థ (IEA) అధిపతి ఫాతిహ్ బిరోల్ హెచ్చరించారు. ఆ ప్రాంతంలో 40కు పైగా ఇంధన క్షేత్రాలు ధ్వంసమయ్యాయని ఆయన వెల్లడించారు. దీనితో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరాపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితులు అంతర్జాతీయ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపి చమురు, గ్యాస్ ధరల్లో అస్థిరతకు దారితీసే అవకాశం ఉందని తెలిపారు.
1970లలో జరిగిన చమురు సంక్షోభం, రష్యా-ఉక్రెయిన్ యుద్ధ సమయంలో ఏర్పడిన ఇంధన సంక్షోభాల కంటే ప్రస్తుతం పరిస్థితులు మరింత తీవ్రమని బిరోల్ పేర్కొన్నారు. ఇప్పటికే అనేక దేశాలు ద్రవ్యోల్బణం, ఆర్థిక మందగమనంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ పరిస్థితి ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పెద్ద ముప్పుగా మారిందన్నారు. 1973 చమురు ఆంక్షల సంక్షోభాన్ని ఉదాహరణగా చూపుతూ, ప్రస్తుత పరిస్థితి పలు సంక్షోభాల మిశ్రమంగా మారిందని తెలిపారు. ఈ సంక్షోభాన్ని తగ్గించడానికి దౌత్యపరమైన చర్యలు అత్యవసరమని ప్రపంచ దేశాలకు సూచించారు.













.avif&w=3840&q=75)








కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!