

కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ద్వంద్వ వైఖరి పాటిస్తోందని ఆరోపించారు. ఈ విషయంపై ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు. పేద కుటుంబాలను ఇళ్ల నుంచి వెళ్లగొడుతూ, అసదుద్దీన్ ఒవైసీకు సంబంధించిన ప్రదేశాలను మాత్రం రక్షిస్తున్నారని విమర్శించారు.
200కు పైగా పేద కుటుంబాలను తరిమేయడానికి అధికారులు వెంటనే బుల్డోజర్లను పంపుతున్నారని ఆయన అన్నారు. కానీ సల్కం చెరువు సమీపంలోని ఒవైసీకి సంబంధించిన కాలేజీ వద్ద మాత్రం యంత్రాలు నిలిచిపోతాయని ఎద్దేవా చేశారు. దీనిని ఆయన ‘‘పేదలకు బఫర్ జోన్లు – ఒవైసీకి కంఫర్ట్ జోన్లు’’ గా పేర్కొన్నారు.
అలాగే నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రధాన మంత్రి ఆవాస్ యోజన ద్వారా పేదలకు ఇళ్లు నిర్మిస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇళ్లను కూల్చేందుకు బుల్డోజర్లను పంపిస్తోందని చెప్పారు. ఇది సరైన పరిపాలన కాదని, రాజకీయ బుజ్జగింపుగా మారిందని బండి సంజయ్ విమర్శించారు.
.webp&w=3840&q=75)











.avif&w=3840&q=75)









కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!