

అమెరికా–ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య యుద్ధ ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో చమురు రవాణాపై ఆందోళనలు తీవ్రంగా పెరిగాయి. హర్మూజ్ జలసంధిపై ఇరాన్ పట్టు సాధించడంతో చమురు నౌకల రవాణా దాదాపు నిలిచిపోయింది. దీనితో ఇంధన సంక్షోభం మరియు ఆర్థిక ప్రభావాలపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో హర్మూజ్ జలసంధిని బలప్రయోగంతో తెరిపించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మిత్రదేశాలను యుద్ధ నౌకలను పంపాలని కోరినా చైనా, ఐరోపా దేశాలు సహకరించేందుకు నిరాకరించాయి.
మరోవైపు పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులు మరింత తీవ్రమవుతున్నాయి. ఇజ్రాయెల్ లెబనాన్ ప్రాంతంలో సైనిక ఆపరేషన్లు చేపట్టగా, ఇరాన్ గల్ఫ్ ప్రాంతాల్లోని ఇంధన మౌలిక వసతులు మరియు విమానాశ్రయాలపై డ్రోన్ దాడులు జరిపినట్లు సమాచారం. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో జరిగిన డ్రోన్ దాడి తర్వాత కొద్ది గంటలకే విమానాశ్రయాన్ని మూసివేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలు యుద్ధాన్ని వెంటనే నిలిపివేయాలని పిలుపునిస్తున్నాయి.















.jpg&w=3840&q=75)






కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!