
ఆరోగ్యం

టాలీవుడ్ యువ హీరో విజయ్ దేవరకొండ మరోసారి తన అభిమానులపై ప్రేమను చాటుకున్నారు. అనపర్తికి చెందిన ఓ అభిమాని ఆయన్ను కలిసి తన పెళ్లి పత్రికను అందించి, వివాహానికి హాజరు కావాలని కోరాడు. విజయ్ ఆప్యాయంగా పలకరించి ఆ ఆహ్వానాన్ని స్వీకరించారు.
ఈ సందర్భంగా ఆ అభిమానికి, అతని కాబోయే వధువుకు విజయ్ శుభాకాంక్షలు తెలియజేశారు. అభిమానితో చూపిన స్నేహపూర్వక వైఖరిని సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. అభిమానులను ఎప్పుడూ నిరాశపరచకుండా, ప్రేమగా స్పందించే విజయ్ మంచి మనసు మరోసారి వెలుగులోకి వచ్చింది.


















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!