
క్రీడలు

భారత వాతావరణ శాఖ ప్రకారం, తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ, రేపు కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముందని వెల్లడించింది.
ఎల్లుండి జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో భారీ వర్షాలు, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. మిగతా జిల్లాల్లో కూడా అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది. రానున్న రెండు రోజులలో ఉష్ణోగ్రతలు ఇదే స్థాయిలో కొనసాగి, తర్వాత మూడు రోజుల్లో 2 నుంచి 3 డిగ్రీలు తగ్గే అవకాశం ఉందని పేర్కొంది.


















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!