
రాజకీయాలు

థ్రిల్లర్ సినిమాలతో ప్రత్యేక గుర్తింపు పొందిన అడివి శేష్ నటించిన యాక్షన్ లవ్ స్టోరీ డెకాయిట్ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ నెల 8 నుంచి స్ట్రీమింగ్ కానుంది. షానియెల్ డియో దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లేను శేష్ స్వయంగా రాశారు. హీరోయిన్గా మృణాల్ ఠాకూర్ ఆకట్టుకోగా, అనురాగ్ కశ్యప్, అతుల్ కులకర్ణి, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రల్లో నటించారు.
కథలో హరిదాస్ (అడివి శేష్) 13 ఏళ్ల జైలు శిక్ష అనంతరం తప్పించుకుని దుబాయ్‌కు వెళ్లేందుకు డబ్బు సంపాదించాలనుకుంటాడు. అదే సమయంలో తనను జైలుకు పంపించిన మాజీ ప్రేయసి సరస్వతి అలియాస్ జూలియట్పై ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తాడు. కానీ ఆమె ప్రస్తుత పరిస్థితిని చూసిన తర్వాత అతని ప్రణాళిక కొత్త మలుపులు తిరుగుతుంది. ప్రేమ, ప్రతీకారం, భావోద్వేగాలతో కూడిన ఈ కథ ప్రేక్షకులను ఆసక్తిగా నడిపిస్తుంది.
కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!