
ఆరోగ్యం

లావణ్య త్రిపాఠి నటించిన సతీ లీలావతి ట్రైలర్‌తో టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. అరుంధతిలో జేజమ్మ తరహాలో ఆమె గర్జించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. పెళ్లి తర్వాత వరుణ్ తేజ్ తో జీవితం ప్రారంభించిన తర్వాత ఇది ఆమె మొదటి తెలుగు సినిమా కావడంతో అంచనాలు పెరిగాయి. రామ్ చరణ్ విడుదల చేసిన ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
భార్యాభర్తల మధ్య జరిగే గొడవలను వినోదాత్మకంగా చూపిస్తూ ఈ సినిమా నవ్వులు పూయించనుంది. దేవ్ మోహన్ భర్త పాత్రలో నటించగా, మడోన్నా సెబాస్టియన్ ఎంట్రీతో కథలో ట్విస్టులు వస్తాయి. నరేష్, సప్తగిరి, వీటీవీ గణేష్ వంటి నటులు హాస్యాన్ని మరింత పెంచనున్నారు. దర్శకుడు తాతినేని సత్య తెరకెక్కించిన ఈ చిత్రం ఈ నెల 8న విడుదల కానుంది.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!