

ప్రముఖ దర్శకుడు ఎంఎస్ రాజు రూపొందిస్తున్న అగధ ఆధ్యాత్మిక రహస్యాలు, దైవిక శక్తుల చుట్టూ తిరిగే కథతో ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఆకట్టుకునే టైటిల్ డిజైన్‌తో ఇప్పటికే ఈ సినిమా అందరి దృష్టిని ఆకర్షించింది. సీనియర్ నటి మంజుల మనవరాలు, వనిత విజయ్‌కుమార్ కూతురు జోవిక ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపిస్తోంది. ఆమె పోస్టర్‌తో పాటు ఉల్కా గుప్తా, కామాక్షి భాస్కర్ల పోస్టర్లు కూడా సినిమాపై అంచనాలను పెంచాయి.
ఆదివరాహ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. దాదాపు 45 నిమిషాల పాటు గ్రాఫిక్స్ ఉండనున్న ఈ సినిమా విజువల్‌గా ప్రత్యేక అనుభూతిని అందించనుంది. 85 రోజుల షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదలకు సిద్ధమవుతోంది. విడుదల తర్వాత సంచలనం సృష్టించే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!