
క్రీడలు

పశ్చిమ బెంగాల్ ఎన్నికల కౌంటింగ్‌కు ముందు ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ పార్టీ నేతలు, కౌంటింగ్ ఏజెంట్లకు కీలక దిశానిర్దేశం చేశారు. బీజేపీ 500 నుంచి 700 ఓట్ల ఆధిక్యంలో ఉంటే వెంటనే రీకౌంటింగ్ కోరాలని స్పష్టం చేశారు. 294 నియోజకవర్గాల్లో కౌంటింగ్ జరుగనున్న నేపథ్యంలో సమన్వయం, నిఘా అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు.
కౌంటింగ్ రోజున ఎలాంటి ఆలస్యం లేకుండా ఉండేందుకు ఏజెంట్లు ముందుగానే కౌంటింగ్ సెంటర్ల వద్ద ఉండాలని సూచించారు. గ్రామీణ, దూర ప్రాంతాల్లో ఉన్న కేంద్రాలకు ముందురోజే చేరుకుని సమీప హోటళ్లలో బస చేయాలని చెప్పారు. టీఎంసీ 200కు పైగా సీట్లలో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేసినప్పటికీ, కౌంటింగ్ సమయంలో ఏమాత్రం నిర్లక్ష్యం చూపకూడదని హెచ్చరించారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!