
గాసిప్స్

అమెరికాకు చెందిన అత్యంత శక్తిమంతమైన విమాన వాహక నౌక జెరాల్డ్ ఆర్ ఫోర్డ్ యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగి గ్రీస్‌లోని నాటో స్థావరం క్రెటెలోని సౌదా బేకు మరమ్మతుల కోసం ప్రయాణిస్తోంది. మార్చి 12న నౌకలోని లాండ్రీ విభాగంలో భారీ అగ్నిప్రమాదం సంభవించగా, ఇద్దరు సైలర్లు గాయపడి చికిత్స పొందారు.
ప్రస్తుతం ఈ నౌక ఎర్ర సముద్రం మీదుగా క్రెటె వైపు కదులుతోంది. అక్కడ తక్షణ మరమ్మతులు చేపట్టనుంది. అయితే క్యారియర్ స్ట్రైక్ గ్రూపులోని ఇతర నౌకలు యుద్ధ క్షేత్రంలోనే కొనసాగుతున్నాయి. ఈ ఘటన తీవ్రతను పెంటగాన్ తగ్గించి చూపుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. న్యూయార్క్ టైమ్స్ ప్రకారం సుమారు 600 మంది సిబ్బందికి సంబంధించిన బెడ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి మరియు అగ్ని సుమారు 30 గంటల పాటు ఆగకుండా మండినట్లు సమాచారం.













.jpg&w=3840&q=75)






.jpg&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!