

అంతర్జాతీయ టెక్ దిగ్గజం గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుతో విశాఖపట్నం ప్రపంచ టెక్ మ్యాప్‌లో కీలక స్థానం దక్కించుకోనుంది. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 28న తర్లువాడలో ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు. సుమారు 15 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడితో 1 గిగావాట్ సామర్థ్యంతో ఈ డేటా సెంటర్ నిర్మించబడుతోంది. ఇది దేశ చరిత్రలోనే అతిపెద్ద విదేశీ పెట్టుబడుల్లో ఒకటిగా నిలవనుంది.
సబ్ సీ కేబుల్ కనెక్టివిటీతో విశాఖ ప్రపంచ దేశాలతో నేరుగా అనుసంధానం అవుతూ, ఏఐ క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు ప్రధాన కేంద్రంగా మారే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా భారీ స్థాయిలో డేటా నిల్వ, క్లౌడ్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. వ్యాపార సౌలభ్య విధానాలతో రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడులను ఆకర్షిస్తుండటంతో ఈ ప్రాజెక్టు సాకారం అవుతోంది.
తర్లువాడ, అడవివరం, రాంబిల్లి ప్రాంతాల్లో సుమారు 600 ఎకరాల్లో విస్తరించే ఈ ప్రాజెక్టులో అదానీ కనెక్స్, ఎయిర్‌టెల్ నెక్స్ట్రా భాగస్వాములుగా ఉన్నాయి. ఏఐ, క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్ రంగాల్లో వేలాది ఉద్యోగ అవకాశాలు సృష్టించబడనున్నాయి. పోర్ట్ సిటీగా ఉన్న విశాఖ, డేటా సిటీగా మారి గ్లోబల్ టెక్ హబ్‌గా ఎదగనుంది.


.webp&w=3840&q=75)










.jpeg&w=3840&q=75)



.webp&w=3840&q=75)




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!