
బిజినెస్

ప్రైవేట్ స్కూళ్లు విద్యార్థుల తల్లిదండ్రులపై ప్రైవేట్ పుస్తకాలు కొనాలని ఒత్తిడి చేస్తున్నాయనే ఆరోపణలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్ఆర్‌సీ)కు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. అధిక ధరల పుస్తకాలను బలవంతంగా కొనిపించడం వల్ల తల్లిదండ్రులపై ఆర్థిక భారం పడుతోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన ఎన్‌హెచ్ఆర్‌సీ రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. జాతీయ స్కూల్ బ్యాగ్ విధానం ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అలాగే ప్రైవేట్ స్కూళ్ల పనితీరుపై సమగ్ర నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించింది. విద్యార్థులు, తల్లిదండ్రుల హక్కులను కాపాడేందుకు కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!