

భారాస నేత, అసెంబ్లీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ టి. హరీశ్‌రావు ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు ఇచ్చిన తీర్పును తీవ్రంగా విమర్శించారు. ఈ నివేదిక ప్రాథమిక హక్కులు, సహజ న్యాయ సూత్రాలను ఉల్లంఘిస్తోందని, దాన్ని చెల్లుబాటు చేయలేమని కోర్టు స్పష్టం చేసిందని ఆయన తెలిపారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్ద చెంపపెట్టు అని వ్యాఖ్యానించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తూ రూ.లక్ష కోట్ల నష్టం జరిగినట్లు అసత్య ఆరోపణలు చేసిందని మండిపడ్డారు. మేడిగడ్డలోని రెండు పిల్లర్లను వెంటనే మరమ్మతులు చేసి రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు.
మీడియాతో మాట్లాడిన హరీశ్‌రావు, ఎన్నికల ముందు నుంచే కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ లబ్ధి కోసం తప్పుడు కేసులు, లీకులు ఇస్తూ వస్తోందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు హైదరాబాద్ సహా తెలంగాణలో 70% తాగునీరు, 37 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే జీవనాధారమని పేర్కొన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే ఈ కుట్రలు జరుగుతున్నాయని విమర్శించారు. సస్పెన్షన్లు, ఎంక్వైరీలతో తమను అడ్డుకోలేరని స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్‌పై కూడా విమర్శలు చేస్తూ గోదావరి–బనకచర్ల లింక్ అంశంపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!