

తమిళ చిత్ర పరిశ్రమలో చోటుచేసుకుంటున్న తాజా పరిణామాలు దక్షిణ భారత సినిమా రంగంలో పెద్ద మార్పులకు దారితీసేలా కనిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన తమిళ ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ సర్వసభ్య సమావేశంలో నిర్మాతలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. థియేటర్లలో విడుదలైన సినిమాలను ఎనిమిది వారాల వరకు ఓటీటీలో విడుదల చేయాలని ఒత్తిడి తేవడాన్ని కౌన్సిల్ తీవ్రంగా వ్యతిరేకించింది. ఇటువంటి నిబంధనలు నిర్మాతలకు ఆర్థిక భారం పెంచుతున్నాయని వారు పేర్కొన్నారు.
ఈ సమస్యపై తుది నిర్ణయం తీసుకునేందుకు మే 10న దక్షిణ భారత నాలుగు రాష్ట్రాల ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రతినిధులు సమావేశం కానున్నారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు సినిమాల విడుదలలను తాత్కాలికంగా నిలిపివేసే అవకాశమూ ఉంది. పెద్ద, మధ్యస్థ బడ్జెట్ సినిమాల్లో నటీనటులు, సాంకేతిక నిపుణులకు పారితోషికం బదులు రెవెన్యూ షేరింగ్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. అలాగే సినిమాల ప్రమోషన్ కోసం సొంత యూట్యూబ్ ఛానల్ ప్రారంభించాలనే ప్రణాళికలు కూడా రూపొందిస్తున్నారు. ఈ నిర్ణయాలు నిర్మాతల ప్రయోజనాలను కాపాడడమే లక్ష్యంగా తీసుకున్నవిగా భావిస్తున్నారు.





.webp&w=3840&q=75)





.jpeg&w=3840&q=75)



.webp&w=3840&q=75)






కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!