

మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకంపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను మంత్రి సీతక్క తీవ్రంగా ఖండించారు. ఆయన వ్యాఖ్యలు మహిళల గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ పథకాన్ని పనికిమాలినదిగా అభివర్ణించడం సరైంది కాదని, నిజంగా పనికిరాదని భావిస్తే దాన్ని రద్దు చేస్తామని చెప్పే ధైర్యం ఉందా అని ప్రశ్నిస్తూ వెంటనే వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ పథకం ద్వారా లక్షలాది మహిళలు రోజువారీ ప్రయాణ ఖర్చులను ఆదా చేసుకుంటూ ఉద్యోగాలు, విద్య, ఆరోగ్య సేవలను సులభంగా పొందుతున్నారని తెలిపారు. ఇప్పటి వరకు వేల కోట్ల రూపాయల మేర మహిళలకు ఆర్థిక ఉపశమనం కలిగిందని పేర్కొన్నారు. ఇది మహిళల ఆర్థిక స్వావలంబనకు మరియు సామాజిక స్వేచ్ఛకు దోహదపడే ముఖ్యమైన అడుగని స్పష్టం చేశారు. మహిళల మనోభావాలను దెబ్బతీసినందుకు వెంటనే క్షమాపణ చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు.













.webp&w=3840&q=75)






.webp&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!