

అమెరికాలో తప్పుడు ఉద్యోగాల పేరుతో హెచ్-1బీ వీసా మోసానికి పాల్పడిన ఇద్దరు భారత సంతతి వ్యక్తులు దోషులుగా తేలారు. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో ఉద్యోగాలు ఉన్నట్లు చూపించి వాస్తవానికి లేని నియామకాల ఆధారంగా వీసా పిటిషన్లు దాఖలు చేసినట్లు దర్యాప్తులో బయటపడింది. కాలిఫోర్నియాలోని అమెరికా అటార్నీ కార్యాలయం వెల్లడించిన వివరాల ప్రకారం, నిందితులు తమ నేరాన్ని అంగీకరించారు.
సంపత్ రాజి (51), కాలిఫోర్నియాలోని డబ్లిన్‌లో వీసా సేవల కేంద్రాలు నిర్వహిస్తుండగా, శ్రీధర్ మాడ (51) యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా అగ్రికల్చర్ అండ్ నేచురల్ రిసోర్సెస్‌లో అధికారిగా పనిచేస్తున్నాడు. ఉద్యోగ నియామకాల అధికారం లేకపోయినా 2020 జూన్ నుంచి 2023 జనవరి వరకు అనేక హెచ్-1బీ వీసా పిటిషన్లు దాఖలు చేసి, ఆమోదం పొందిన తర్వాత ఇతరులకు బదిలీ చేసినట్లు గుర్తించారు. ఈ కేసులో ఇద్దరికీ గరిష్ఠంగా ఐదేళ్ల జైలు శిక్షతో పాటు 2.5 లక్షల డాలర్ల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!