
న్యూస్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హర్మూజ్ జలసంధిలో పలు నౌకలపై దాడులు జరిపిందని ఇరాన్‌పై ఆరోపించారు. ఇది కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు. హర్మూజ్ మూసివేత వల్ల ఇరాన్ రోజుకు సుమారు రూ.4,600 కోట్ల నష్టం వాటిల్లుతుందని, అమెరికాకు పెద్దగా నష్టం ఉండదని స్పష్టం చేశారు. ఇరాన్‌తో చర్చల కోసం అమెరికా ప్రతినిధులు పాకిస్థాన్‌కు వెళ్లనున్నట్లు తెలిపారు.
ఇరాన్ అమెరికా ప్రతిపాదించిన ఒప్పందాన్ని అంగీకరించకపోతే విద్యుత్ కేంద్రాలు, వంతెనలపై దాడులు చేసే అవకాశం ఉందని ట్రంప్ హెచ్చరించారు. ఇకపై తాను కఠినంగా వ్యవహరిస్తానని పేర్కొన్నారు. దీనికి స్పందించిన ఇరాన్, తమ హక్కులను హరించే అధికారం అమెరికాకు లేదని తెలిపింది. పాకిస్థాన్ వేదికగా జరిగిన శాంతి చర్చలు విఫలమవడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!