
న్యూస్

జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం ముగిలిపేట సమీపంలో జరిగిన ప్రమాదంలో ట్రాక్టర్ బోల్తా పడటంతో నలుగురు కూలీలు మృతి చెందారు. పసుపు పంట కోత పనులు ముగించుకుని తిరిగి వస్తుండగా ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడినట్లు సమాచారం.
ఈ ఘటనలో పలువురు కూలీలకు గాయాలు కాగా, వారిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!