

రేపు తెలంగాణలో తొలివిడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. పోలింగ్ ఉదయం 7 గంటల నుండి 1 గంట వరకు కొనసాగుతుంది. మద్యాహ్నం 2 గంటల నుండి కౌంటింగ్ ప్రారంభమై, సాయంత్రం ఫలితాలు వెల్లడించబడతాయి.
రాష్ట్రంలో 4,236 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి, వీటిలో 27,960 వార్డులకు పోలింగ్ నిర్వహించబడుతుంది. సర్పంచ్ స్థానాలకు 22,330 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. 37,440 వార్డులకు గాను మొత్తం 85,428 మంది నామినేషన్లు దాఖలు అయ్యాయి.
నల్లగొండ జిల్లా నామినేషన్లలో అగ్రస్థానంలో ఉంది. ఇక్కడ సర్పంచ్ స్థానానికి అత్యధిక పోటీ ఉంది. నల్లగొండలో 318 పంచాయతీలకు 1,950 మంది సర్పంచ్ అభ్యర్థులు నామినేషన్ చేసుకున్నారు. ఒక్కో పదవికి సగటున 6 మంది పోటీ పడుతున్నారు. ములుగు జిల్లాలో అత్యల్ప నామినేషన్లు నమోదయ్యాయి. 48 పంచాయతీలకు కేవలం 273 మంది అభ్యర్థులు మాత్రమే నామినేషన్ చేసుకున్నారు, ఇది రాష్ట్రంలో అత్యల్పం.
వార్డు మెంబర్ల నామినేషన్లలో కూడా నల్లగొండ రికార్డు సృష్టించింది. 2,870 వార్డులలో 7,893 మంది అభ్యర్థులు నామినేషన్ చేసుకున్నారు. వికారాబాద్ జిల్లాలో 2,198 వార్డులకు 4,311 మంది, రంగారెడ్డి జిల్లాలో 1,530 వార్డులకు 4,122 మంది అభ్యర్థులు నామినేషన్ చేసుకున్నారు. ములుగు జిల్లా 420 వార్డులకు కేవలం 959 మంది అభ్యర్థులతో చివరి స్థానంలో ఉంది. నారాయణపేట 572 వార్డులకు 1,183 మంది అభ్యర్థులు నామినేషన్ చేసారు.
ఇప్పటి వరకు ఐదు సర్పంచ్ స్థానాలు, 133 వార్డులు ఏకగ్రీవంగా ఉన్నట్లు తెలిసింది. నామినేషన్ల ఉపసంహరణ తర్వాత మరిన్ని ఏకగ్రీవ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!