

చాలామంది కీరదోసను సలాడ్లలో పండ్లతో కలిపి తింటుంటారు. అయితే ఇలా తీసుకోవడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. పండ్లు త్వరగా జీర్ణమవుతాయి, కానీ కీరదోస జీర్ణం కావడానికి కొంత సమయం పడుతుంది. ఈ రెండింటిని కలిపి తినడం వల్ల కడుపులో పులియబెట్టే ప్రక్రియ మొదలై గ్యాస్, కడుపు ఉబ్బరం, అజీర్తి వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యంగా అరటిపండు, మామిడిపండు వంటి పండ్లతో కీరదోసను కలిపి తినకూడదని సూచిస్తున్నారు. అలాగే పాలు లేదా పెరుగు వంటి పాల ఉత్పత్తులతో కలిపి తీసుకుంటే కొందరిలో కడుపు నొప్పి, అసౌకర్యం కలగవచ్చు. కీరదోసను విడిగా తీసుకోవడం ఉత్తమం. రుచికోసం కొద్దిగా ఉప్పు లేదా నిమ్మరసం కలుపుకోవచ్చు.
మరోవైపు కీరదోసను మితంగా తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. రాత్రి సమయంలో ఎక్కువగా తింటే జీర్ణక్రియ మందగించి, ఉదయానికి గ్యాస్ లేదా కడుపు ఉబ్బరం వంటి సమస్యలు రావచ్చు. ఇందులో నీటి శాతం ఎక్కువగా ఉండటంతో రాత్రి వేళల్లో కాకుండా మధ్యాహ్నం లేదా సాయంత్రం సమయంలో తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఒకేసారి ఎక్కువగా తింటే శరీరంలోని ద్రవాల సమతుల్యత దెబ్బతిని కొందరిలో మైకం లేదా నీరసం రావచ్చు. ఏ ఆహారమైనా మితంగా, సరైన సమయంలో తీసుకుంటేనే ఆరోగ్యానికి మేలు చేస్తుంది. సరైన విధంగా కీరదోసను తీసుకుంటే వేసవిలో శరీరాన్ని చల్లగా, ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.
గమనిక : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!