

టీ20 వరల్డ్‌కప్‌లో కెనడా జట్టుపై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఈ ఆరోపణలపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) విచారణ ప్రారంభించింది. ఈ కేసులో షాకింగ్ అంశాలు బయటకు వస్తున్నాయని సమాచారం. ఫిక్సింగ్ వ్యవహారం వెనుక కరుడుగట్టిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ హస్తం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
టోర్నీలో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో కెనడా కెప్టెన్ దిల్‌ప్రీత్ బజ్వా ప్రదర్శనపై అనుమానాలు తలెత్తినట్లు తెలుస్తోంది. దీంతో అవినీతి నిరోధక విభాగం అతడిని విచారించడంతో పాటు, మొబైల్ ఫోన్‌ను కూడా స్వాధీనం చేసుకుని తనిఖీ చేసినట్లు సమాచారం.
అదేవిధంగా దిల్‌ప్రీత్ బజ్వాను కెనడా జట్టు కెప్టెన్‌గా నియమించడం వెనుక కూడా బిష్ణోయ్ గ్యాంగ్ ప్రభావం ఉందని కెనడా బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ (CBC) తన కథనంలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారం అంతర్జాతీయ క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!