

అస్సి అనే హిందీ సినిమా ప్రస్తుతం జీ5 లో స్ట్రీమింగ్ అవుతోంది. దేశంలో ప్రతి రోజు జరిగే దారుణాలపై గట్టిగా ఆలోచింపజేసే విధంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. రోజుకు దాదాపు ఎనభై వరకు ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయనే నిజాన్ని చూపిస్తూ కథ సాగుతుంది. పరిమ అనే టీచర్ తన కుటుంబంతో సంతోషంగా జీవిస్తుండగా ఒక రోజు జరిగిన సంఘటన ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది.
ఈ కేసులో పరిమకు న్యాయం అందించేందుకు లాయర్ పాత్రలో తాప్సి పోరాడుతుంది. విచారణలో ఎదురయ్యే సమస్యలు, సాక్ష్యాలు ఎలా మారుస్తారో సినిమా సహజంగా చూపిస్తుంది. కథలో పెద్ద మలుపులు లేకపోయినా నిజ జీవితానికి దగ్గరగా ఉండే విధంగా చూపించడం వల్ల చివరి వరకు ఆసక్తి కలిగిస్తుంది. న్యాయం నిజంగా దక్కుతుందా అనే ప్రశ్న ప్రేక్షకుల మనసులో నిలిచిపోతుంది.
పరిమ పాత్రలో కని కుస్రుతి నటన చాలా సహజంగా ఉంటుంది. ముఖ్యంగా కోర్టు సన్నివేశాలు, క్లైమాక్స్ చాలా ప్రభావం చూపిస్తాయి. బాధితులకు కుటుంబం ఎలా తోడుగా ఉండాలో కూడా ఈ సినిమా తెలియజేస్తుంది. మొత్తం మీద పెద్దవాళ్లు తప్పక చూడాల్సిన ఆలోచింపజేసే చిత్రం ఇది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!