

తెలుగు ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తూ మరో సినిమా నిశ్శబ్దంగా ఓటీటీలోకి వచ్చేసింది. మంచు లక్ష్మి, అనన్య నాగళ్ల నటించిన ‘లేచింది మహిళా లోకం’ సినిమా ఈ రోజు నుంచి సన్ నెక్స్ట్లో స్ట్రీమింగ్ ప్రారంభమైంది. ఇదే సమయంలో మరో సినిమా కూడా ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా అకస్మాత్తుగా ఓటీటీలో అందుబాటులోకి రావడం ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగిస్తోంది.
శ్రీనాథ్ మాగంటి హీరోగా నటించిన ‘మెన్షన్ హౌస్ మల్లేష్’ సినిమా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. బాల సతీష్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం మార్చి 6న థియేటర్లలో విడుదలై పెద్దగా ప్రభావం చూపలేదు. అయితే వచ్చే వారం నుంచి సన్ నెక్స్ట్లో కూడా ఈ సినిమా స్ట్రీమింగ్ కానుండటం విశేషం.
ఈ సినిమా కథ మల్లేష్ అనే గ్రామీణ యువకుడి జీవితాన్ని చూపిస్తుంది. చిన్నప్పటి నుంచే తాగుడికి అలవాటు పడిన అతడు తన బావతో గొడవలు పడుతూ ఉంటాడు. తల్లి ఒత్తిడితో జ్యోతి అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. అయితే శోభనం రాత్రి అతనికి ఒక ఆశ్చర్యకరమైన విషయం తెలిసి అతని జీవితం మలుపు తిరుగుతుంది. ఇంతకీ అదేంటి? దానివల్ల మల్లేష్ జీవితం ఎలాంటి మలుపు తిరిగింది? అనేది మిగతా స్టోరీ.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!