
గాసిప్స్
.jpg&w=3840&q=75)
శబరిమలలో తెలుగు భక్తుల పై స్థానిక వ్యాపారులు దాడి చేసిన ఘటన ఉద్రిక్తతకు దారితీసింది. వాటర్ బాటిల్ ధర ఎందుకు ఎక్కువగా వసూలు చేస్తున్నారని ఓ అయ్యప్ప భక్తుడు ప్రశ్నించడంతో వాగ్వాదం ప్రారంభమైంది. ఆ తర్వాత షాపు యజమాని గాజు సీసాతో భక్తుడి పై దాడి చేసి తల పగలగొట్టినట్లు సమాచారం.
ఈ ఘటన తెలుసుకున్న వెంటనే తెలుగు రాష్ట్రాలకు చెందిన పెద్ద సంఖ్యలో అయ్యప్ప భక్తులు షాపు వద్దకు చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. దాడి చేసిన వ్యాపారి పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు జోక్యం చేసుకుని వ్యాపారులను –భక్తులను నియంత్రించారు.


_1771477764226.jpg&w=3840&q=75)

















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!