
సినిమాలు

తెలంగాణ రాష్ట్రానికి త్వరలో కొత్త డీజీపీ (పోలీస్ బాస్) నియామకం జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం డీజీపీ ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరుకున్నట్లు సమాచారం. ఈ ప్రక్రియలో భాగంగా ఢిల్లీలో జరిగిన ఎంపిక కమిటీ సమావేశానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు హాజరయ్యారు.
డీజీపీ పదవికి సీవీ ఆనంద్, శిఖా గోయల్, సౌమ్య మిశ్రా, వినాయక్ ప్రభాకర్ ఆప్టే పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఈ నలుగురు అధికారులలో ఒకరి పేరును తొలగించి, ముగ్గురు అధికారుల పేర్లతో కూడిన తుది జాబితాను యూపీఎస్సీ రాష్ట్ర ప్రభుత్వానికి పంపనుంది.
యూపీఎస్సీ పంపిన ఆ ముగ్గురు అధికారులలో ఒకరిని తెలంగాణ ప్రభుత్వం డీజీపీగా ఎంపిక చేయాల్సి ఉంటుంది. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీవీ ఆనంద్ వైపు మొగ్గు చూపుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.

.jpg&w=3840&q=75)















.jpg&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!