
రాజకీయాలు

భారత్-చైనా మధ్య దౌత్య సంబంధాల్లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో గత ఐదేళ్లుగా నిలిచిపోయిన చైనా పౌరుల పర్యాటక వీసాలను మళ్లీ ప్రారంభించాలని భారత్ నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. గల్వాన్ ఘటన అనంతరం చైనా టూరిస్ట్ వీసాల జారీ నిలిపివేసిన విషయం తెలిసిందే.
పర్యాటక వీసాల పునరుద్ధరణ ద్వారా పొరుగుదేశంతో సంబంధాలను సాధారణ స్థితికి తీసుకురావడమే ప్రధాన ఉద్దేశ్యంగా తెలుస్తోంది. అధికారుల సమాచారం ప్రకారం, చైనా మరియు హాంకాంగ్ పౌరులకు వీసాల జారీకి అనుమతి ఇచ్చారు. ఇరుదేశాల మధ్య సంబంధాల మెరుగుదలలో భాగంగా గత ఏడాది నుంచి ఆంక్షల సడలింపు కొనసాగుతోంది. ఇప్పటికే నేరుగా విమాన సర్వీసులను పునరుద్ధరించగా, దీర్ఘకాలంగా నిలిచిపోయిన కైలాస మానససరోవర్ యాత్రను కూడా తిరిగి ప్రారంభించారు.












.webp&w=3840&q=75)









కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!