Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ఉద్ధవ్‌ శివ సేన’లో మళ్లీ చీలిక సంకేతాలు.. బీజేపీ నేతలతో మీటింగ్స్

11:35 AM, 26 ఏప్రిల్, 2026
ఉద్ధవ్‌ శివ సేన’లో మళ్లీ చీలిక సంకేతాలు.. బీజేపీ నేతలతో మీటింగ్స్

మహారాష్ట్ర మాజీ సీఎం, శివసేన (యూబీటీ) చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రే మరో చీలిక ఎదుర్కోనున్నట్లు కనిపిస్తున్నది. ఆయన పార్టీకి చెందిన కొందరు ఎంపీలు బీజేపీ నేతలతో సమావేశం కావడం అనుమానాలకు తావిస్తున్నది.  మరాఠ్వాడా ప్రాంతంలో ఆ పార్టీకి చెందిన ప్రముఖ నేత, మూడుసార్లు లోక్‌సభ ఎంపీగా ఎన్నికైన సంజయ్ జాదవ్, ముంబైలోని ఉద్ధవ్ ఠాక్రే నివాసమైన మాతోశ్రీలో జరిగిన కీలక సమావేశానికి గైర్హాజరయ్యారు. అలాగే సేనా భవన్‌లో ఏర్పాటు చేసిన పార్టీ కార్యవర్గ సభ్యుల మరో సమావేశానికి కూడా ఆయన హాజరు కాలేదు. దీంతో సంజయ్ జాదవ్ గైర్హాజరు పార్టీ వర్గాల్లో ఆందోళనలు రేకెత్తించింది. అప్పటి నుంచి ఆయన అందుబాటులో లేరని పార్టీ వర్గాలు తెలిపాయి.

కాగా, శివసేన (యూబీటీ)కి చెందిన హింగోలి నియోజకవర్గం ఎంపీ నాగేష్ పాటిల్ అష్టికర్, యవత్మల్-వషీం నియోజకవర్గం ఎంపీ సంజయ్ దేశ్‌ముఖ్ కలిసి ఇటీవల కేంద్ర మంత్రి ప్రతాపరావు జాదవ్ ఢిల్లీలో ఇచ్చిన విందుకు హాజరయ్యారు. ఆ తర్వాత కొన్ని రోజులకే కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను సంజయ్ జాదవ్ ఢిల్లీలో కలిసినట్లు వార్తలు వచ్చాయి. దీంతో ఏదో రాజకీయ మంతనాలు జరుగుతున్నాయన్న ఊహాగానాలకు మరింత బలం చేకూరింది. మరోవైపు శివసేన (యూబీటీ) అగ్రనాయకత్వం, ఆ పార్టీ ఎంపీల మధ్య సమన్వయం లేనట్లు తెలుస్తున్నది. దీని పట్ల కొందరు ఎంపీలు ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం.

ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ పేలవ ప్రదర్శనకు ఇది కారణమని వారు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొందరు ఎంపీలు ఇతర పార్టీల వైపు చూస్తున్నట్లు తెలుస్తున్నది. దీంతో ఈ ముగ్గురు ఎంపీలు బీజేపీలో చేరుతారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలో జరిగిన తిరుగుబాటు శివసేనను చీల్చిన మాదిరిగా నాలుగేళ్ల తర్వాత శివసేన (యూబీటీ)లో మరో చీలిక రావచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఏఐ వినియోగంపై ఫ్రాంచైజ్ సినిమాలకు విమర్శలు !

ఏఐ వినియోగంపై ఫ్రాంచైజ్ సినిమాలకు విమర్శలు !

నాదెండ్ల భాస్కరరావు మృతికి సీఎం సంతాపం

నాదెండ్ల భాస్కరరావు మృతికి సీఎం సంతాపం

ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు–అధికారుల చర్చలు విఫలం.. సమ్మెకు సిద్ధం

ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు–అధికారుల చర్చలు విఫలం.. సమ్మెకు సిద్ధం

హైకోర్టు తీర్పు పై స్పందించిన కిషన్ రెడ్డి

హైకోర్టు తీర్పు పై స్పందించిన కిషన్ రెడ్డి

ఏపీ మద్యం కేసులో నిందితుల ఇళ్లపై ఈడీ దాడులు

ఏపీ మద్యం కేసులో నిందితుల ఇళ్లపై ఈడీ దాడులు

అమ్మ బర్త్డే పై మహేష్ బాబు ఎమోషనల్ పోస్ట్ !

అమ్మ బర్త్డే పై మహేష్ బాబు ఎమోషనల్ పోస్ట్ !

ఇన్ఫోసిస్ లో 20 వేల మంది ప్రెషర్ల నియామకం

ఇన్ఫోసిస్ లో 20 వేల మంది ప్రెషర్ల నియామకం

బాలకృష్ణ ఆ దర్శకుడితో సినిమా చేస్తున్నారా ?

బాలకృష్ణ ఆ దర్శకుడితో సినిమా చేస్తున్నారా ?

హైదరాబాద్ మెట్రో టేక్ ఓవర్ కు లోన్

హైదరాబాద్ మెట్రో టేక్ ఓవర్ కు లోన్

ఓర్మాక్స్ మీడియా టాప్ హీరోల జాబితా.. మరోసారి ఆ హీరోనే నెంబర్ వన్

ఓర్మాక్స్ మీడియా టాప్ హీరోల జాబితా.. మరోసారి ఆ హీరోనే నెంబర్ వన్

ట్యాగ్లు
ఉద్దవ్ థాకరేశివసేనబీజేపీశివసేనలో చీలిక
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘డేవిడ్ రెడ్డి’ రీషూట్ వెనుక అసలు కారణం ఏమిటి?
గాసిప్స్

‘డేవిడ్ రెడ్డి’ రీషూట్ వెనుక అసలు కారణం ఏమిటి?

భారీ యాక్షన్ సన్నివేశాల్లో ‘డ్రాగన్’ దూకుడు
గాసిప్స్

భారీ యాక్షన్ సన్నివేశాల్లో ‘డ్రాగన్’ దూకుడు

మారుతున్న ఓటీటీ పరిస్థితి?
సినిమాలు

మారుతున్న ఓటీటీ పరిస్థితి?

 మహేష్ బాబు  మూవీ  నేనొక్కడినే’ రీ-రిలీజ్‌కు రెడీ
సినిమాలు

మహేష్ బాబు మూవీ నేనొక్కడినే’ రీ-రిలీజ్‌కు రెడీ

కేటీఆర్ టెలీ కాన్ఫరెన్స్‌లో నేతలకు కీలక సూచనలు
రాజకీయాలు

కేటీఆర్ టెలీ కాన్ఫరెన్స్‌లో నేతలకు కీలక సూచనలు

బెంగాల్‌లో బీజేపీ విజయం ఖాయం - అమిత్ షా
రాజకీయాలు

బెంగాల్‌లో బీజేపీ విజయం ఖాయం - అమిత్ షా

నీతి అయోగ్ వైస్ చైర్మన్ పశ్చిమ బెంగాల్ బీజేపీ ఎమ్మెల్యే
రాజకీయాలు

నీతి అయోగ్ వైస్ చైర్మన్ పశ్చిమ బెంగాల్ బీజేపీ ఎమ్మెల్యే

విశాల్ ‘మకుటం’ లో హీరోయిన్‌గా అంజలి
సినిమాలు

విశాల్ ‘మకుటం’ లో హీరోయిన్‌గా అంజలి

మత మార్పిడి కుట్రకు ఆధారాల్లేవ్‌ – నిజ నిర్ధారణ కమిటీ
న్యూస్

మత మార్పిడి కుట్రకు ఆధారాల్లేవ్‌ – నిజ నిర్ధారణ కమిటీ

'ది కేరళ స్టోరీ 2' ఓటీటీ రిలీజ్‌కి కొత్త డేట్ ఫిక్స్
ఓటిటి

'ది కేరళ స్టోరీ 2' ఓటీటీ రిలీజ్‌కి కొత్త డేట్ ఫిక్స్

ఉద్ధవ్‌ శివ సేన’లో మళ్లీ చీలిక సంకేతాలు.. బీజేపీ నేతలతో మీటింగ్స్
రాజకీయాలు

ఉద్ధవ్‌ శివ సేన’లో మళ్లీ చీలిక సంకేతాలు.. బీజేపీ నేతలతో మీటింగ్స్

బెంగాల్ ఎన్నికల వేడిలో మోదీ కీలక వ్యాఖ్యలు
రాజకీయాలు

బెంగాల్ ఎన్నికల వేడిలో మోదీ కీలక వ్యాఖ్యలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!