
గాసిప్స్

'ది కేరళ స్టోరీ 2' ఓటీటీ విడుదల తేదీలో మార్పు చోటు చేసుకుంది. జీ5 ముందుగా వచ్చే నెల 8 నుంచి స్ట్రీమింగ్ చేస్తామని ప్రకటించినప్పటికీ, ఇప్పుడు వచ్చే నెల 1 నుంచే అందుబాటులోకి రానుందని తెలిపింది. అదే తేదీ నుంచి తెలుగు ఆడియోలో కూడా సినిమా చూడవచ్చని వెల్లడించింది. కామాఖ్య నారాయణ్ సింగ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఇప్పటికే వివాదాల మధ్య థియేటర్లలో విడుదలైంది.
ఈ చిత్రంలో ఉల్కా గుప్తా, అదితి భాటియా, ఐశ్వర్య ఓజా ప్రధాన పాత్రల్లో నటించారు. సురేఖ, దివ్య, నేహా అనే ముగ్గురు యువతుల జీవితాల్లో ప్రేమ కారణంగా వచ్చిన మార్పులు ఈ కథలో చూపించారు. కుటుంబాల మాటలు పట్టించుకోకుండా వెళ్లిన వారు తర్వాత ఎదుర్కొన్న మోసాలు, నిజాలు తెలుసుకున్న తర్వాత తీసుకున్న నిర్ణయాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది.















.webp&w=3840&q=75)






కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!