

ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం ఉదయం సాంకేతిక లోపం తలెత్తింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) వ్యవస్థలో అకస్మాత్తుగా వచ్చిన టెక్నికల్ సమస్య కారణంగా విమానాల రాకపోకలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. దీంతో 100కు పైగా దేశీయ మరియు అంతర్జాతీయ విమానాలు ఆలస్యం అయ్యాయి. కొన్నింటి టేకాఫ్‌లు వాయిదా పడగా, మరికొన్నింటి ల్యాండింగ్‌లు కూడా నిలిపివేయాల్సి వచ్చింది. అకస్మాత్తుగా ఏర్పడిన ఈ పరిస్థితి కారణంగా టెర్మినల్‌ల్లో పెద్ద ఎత్తున ప్రయాణికులు ఇరుక్కుపోయారు. గంటల తరబడి ఎదురు చూడాల్సి రావడంతో ప్రయాణికుల ఆగ్రహం వ్యక్తమవుతోంది.
సాంకేతిక లోపాన్ని పరిష్కరించేందుకు ఇంజినీరింగ్ బృందాలు ఇప్పటికే పనిలో నిమగ్నమయ్యాయని ఎయిర్పోర్ట్ అధికారులు తెలిపారు. సమస్యను త్వరలోనే పరిష్కరించేందుకు అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు.
ప్రయాణికులు తమ ప్రయాణ వివరాలను సంబంధిత విమానయాన సంస్థల వెబ్సైట్లు లేదా హెల్ప్‌డెస్క్ ద్వారా తెలుసుకోవాలని సూచించారు.








.jpg&w=3840&q=75)




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!