
సినిమాలు

గచ్చిబౌలిలో నిర్వహించేందుకు జనసేన పార్టీ సిద్ధం చేసిన ‘నవనిర్మాణ సంకల్ప సభ’కు పోలీసులు అనుమతి మంజూరు చేయలేదు. తెలంగాణలో పార్టీ కార్యకలాపాల విస్తరణలో భాగంగా ఈ సభను నిర్వహించాలని జనసేన ప్రణాళిక రూపొందించింది.
అయితే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, వాటికి సంబంధించిన భద్రతా ఏర్పాట్లు, శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా సభకు అనుమతి ఇవ్వలేమని పోలీసులు స్పష్టం చేసినట్లు సమాచారం. దీంతో జనసేన నేతలు న్యాయస్థానాన్ని ఆశ్రయించి సభ నిర్వహణకు అనుమతి ఇవ్వాలని కోరారు. ఈ వ్యవహారంపై కోర్టు తీర్పు కోసం పార్టీ ఆసక్తిగా ఎదురుచూస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!