
రాజకీయాలు

ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫాంటసీ యాక్షన్ చిత్రం ‘హీ-మ్యాన్ అండ్ ది మాస్టర్స్ ఆఫ్ ది యూనివర్స్’ జూన్ 5న ఘనంగా విడుదల కానుంది. ఇంగ్లీష్‌తో పాటు హిందీ, తమిళ, తెలుగు, మలయాళ భాషల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుండటంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ చిత్రంలోని ఐకానిక్ విలన్ స్కెలెటర్ పాత్రకు తమిళ, తెలుగు, మలయాళ భాషల్లో ప్రముఖ నటుడు ఆదిత్య మీనన్ గాత్రం అందించారు. హిందీ వెర్షన్‌లో ప్రముఖ నటుడు జావేద్ జాఫ్రీ డబ్బింగ్ చెప్పారు. చిన్ననాటి నుంచే హీ-మ్యాన్ ఫ్రాంచైజీతో అనుబంధం ఉందని చెప్పిన ఆదిత్య మీనన్, స్కెలెటర్ వంటి చిరస్మరణీయ ప్రతినాయకుడికి మూడు భాషల్లో గాత్రం అందించడం తనకు ప్రత్యేక గౌరవమని తెలిపారు. అమెజాన్ MGM స్టూడియోస్ నిర్మించిన ఈ భారీ చిత్రం జూన్ 5, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!