

ఏపీ రాష్ట్రంలో 16 ఏళ్ల లోపు పిల్లల సోషల్ మీడియా వినియోగంపై నిషేధం విధించే అంశాన్ని ప్రభుత్వం గంభీరంగా పరిశీలిస్తోంది. ఈ విషయంపై సమగ్ర అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలీస్ శాఖకు ఆదేశాలు జారీ చేశారు. చిన్నారులు సోషల్ మీడియాలో ఎదుర్కొంటున్న మానసిక, సామాజిక ప్రభావాలు, అలాగే పెరుగుతున్న దుర్వినియోగ ఘటనలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకునే దిశగా ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది.
సోషల్ మీడియాలో పెరుగుతున్న విచ్చలవిడితనానికి కట్టడి అవసరమని సీఎం స్పష్టం చేశారు. ముఖ్యంగా పిల్లలు, యువత గురయ్యే ఘటనలను ఏమాత్రం ఉపేక్షించవద్దని పోలీస్ శాఖకు ఆదేశించారు. ఎవరు అయినా ఆన్లైన్ వేదికల ద్వారా ఇతరులపై దూషణలు, అవమానకర వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ అంశంపై ప్రస్తుతం ఉన్న చట్టాలు సరిపోకపోతే, అవసరమైతే ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకువచ్చేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందని చంద్రబాబు నాయుడు తెలిపారు. భవిష్యత్ తరాల భద్రత, మానసిక ఆరోగ్యం దృష్ట్యా సోషల్ మీడియా వినియోగంపై స్పష్టమైన నియంత్రణలు అవసరమని ప్రభుత్వం భావిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!