

ప్రభుత్వరంగ బీమా దిగ్గజం ఎల్ఐసీ (LIC) ఫిన్‌టెక్ రంగంలోకి ప్రవేశించే అవకాశాలను పరిశీలిస్తోంది. దేశంలో డిజిటల్ ఆర్థిక సేవల వినియోగం వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో వ్యూహాత్మక పెట్టుబడులు లేదా సొంతంగా ఫిన్‌టెక్ విభాగాన్ని ఏర్పాటు చేసే దిశగా సంస్థ ఆలోచిస్తున్నట్లు ఎల్ఐసీ సీఈఓ, ఎండీ ఆర్. దొరైస్వామి వెల్లడించారు. ఆధునిక అవసరాలను తీర్చడం, సాంకేతిక ఆవిష్కరణలను వేగవంతం చేయడం లక్ష్యంగా ఫిన్‌టెక్, ఇన్సురెన్స్‌టెక్ సంస్థలతో కలిసి పనిచేస్తున్నట్లు తెలిపారు.
దేశంలోనే అతిపెద్ద ఆర్థిక సంస్థల్లో ఒకటైన ఎల్ఐసీ ఇప్పటికే అనేక ప్రముఖ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిందని ఆయన పేర్కొన్నారు. పాలసీదారులకు మెరుగైన ప్రయోజనాలు అందించేందుకు వ్యూహాత్మక పెట్టుబడుల అవకాశాలను కూడా పరిశీలిస్తున్నట్లు చెప్పారు. సొంత సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా వ్యాపార అప్లికేషన్లను అభివృద్ధి చేసుకుంటూనే, కొత్త డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు మరియు సాంకేతిక మౌలిక వసతుల కోసం ఐటీ సేవల సంస్థలతో భాగస్వామ్యం కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. ఫిన్‌టెక్ పోటీలో నిలదొక్కుకోవాలంటే టెక్నాలజీ ఆధునీకరణ కీలకమని ఆయన స్పష్టం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!