
జనరల్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు కొమరంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. సాయంత్రం 5:45 గంటలకు కెరమెరి మండలంలోని కొత్తారి గ్రామానికి చేరుకుని ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారుల గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల రెండో విడత ప్రారంభోత్సవానికి సంబంధించిన పైలాన్‌ను ఆవిష్కరించనున్నారు. అనంతరం లబ్ధిదారులతో ముఖాముఖి సమావేశం నిర్వహించి పథకం అమలుపై వివరాలు తెలుసుకోనున్నారు.
తర్వాత రోడ్డు మార్గంలో కాగజ్‌నగర్ ఎక్స్‌రోడ్స్‌కు చేరుకుని పలు అభివృద్ధి పనులను ప్రారంభించడంతో పాటు శంకుస్థాపనలు చేయనున్నారు. అనంతరం అక్కడ నిర్వహించే భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించనున్నారు. సభ ముగిసిన తర్వాత మంచిర్యాలకు చేరుకుని, అక్కడి నుంచి రాత్రి 10 గంటలకు హైదరాబాద్‌కు బయలుదేరనున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!