

ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ తన సేవా దృక్పథాన్ని మరోసారి చాటుకున్నారు. హైదరాబాద్‌లోని లోయర్ ట్యాంక్‌బండ్‌లో ఉన్న ఆల్ ఇండియా కాపు, తెలగ, బలిజ సంఘం (AITKB)కు రూ.30 లక్షల విరాళం అందజేశారు. తన తండ్రి, పద్మశ్రీ డా. అల్లు రామలింగయ్య స్మారకార్థం సంఘ భవనంలో ఒక గది నిర్మాణం కోసం ఈ విరాళాన్ని అందించారు. ఈ కార్యక్రమం సంఘ సభ్యులు, నాయకుల సమక్షంలో జరిగింది.
ఈ విరాళం ద్వారా విద్యార్థులు, నిరుపేదలు మరియు కాపు, తెలగ, బలిజ, ఒంటరి వర్గాల సంక్షేమ కార్యక్రమాలకు మరింత ఊతం లభించనుంది. సంఘ భవనం ద్వారా నిర్వహించే విద్యా, సామాజిక సేవా కార్యక్రమాలకు ఈ సహాయం ఉపయోగపడనుంది. సంఘ నాయకులు ఏవీ రత్నం, కోటేల శ్రీహరి, అరవ రామకృష్ణ, బైరా దిలీప్, చల్వాది రవి, విద్యాసాగర్, సుంకర వెంకటేశ్వరరావు, శివాజీ తదితరులకు అల్లు అరవింద్ చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా సంఘ సభ్యులు ఆయనకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!