
సినిమాలు

గత కొన్ని రోజులుగా జమ్మూ కాశ్మీర్‌తో పాటు పలు రాష్ట్రాల్లో భారీ మంచు తుఫాన్ కొనసాగుతోంది. అధిక హిమపాతం కారణంగా రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించగా, పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్‌లోని గందర్బల్ జిల్లాలో ఉన్న ప్రముఖ పర్యాటక కేంద్రం సోనామార్గ్‌లో భారీ మంచు చరియలు విరిగి పడ్డాయి.
మంగళవారం రాత్రి సుమారు 10:12 గంటల సమయంలో జరిగిన ఈ ఘటనలో మంచు చరియలు ఒక్కసారిగా భవనాలను కమ్మేశాయి. ఈ భీకర దృశ్యాలు అక్కడ ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. అయితే ఘటన సమయంలో ఆ ప్రాంతంలో ఎవరూ లేకపోవడంతో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. ముందస్తు హెచ్చరికల నేపథ్యంలో సహాయక బృందాలు అప్రమత్తంగా ఉండగా, పర్యాటకులు మరియు స్థానికులు కొండ ప్రాంతాలకు వెళ్లవద్దని యంత్రాంగం సూచించింది.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!