
న్యూస్

ప్రఖ్యాత గాయని ఆశాభోంస్లేకు ముంబైలో అంత్యక్రియలు నిర్వహించగా, ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరై నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మేటి క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తన భార్య అంజలి టెండూల్కర్తో కలిసి నివాళి అర్పించారు. అయితే ఆ క్షణంలో సచిన్ భావోద్వేగానికి లోనై కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. అక్కడున్న వారితో మాట్లాడుతూనే ఆయన కంటతడి పెట్టడం అందరినీ కలచివేసింది.
శివాజీ పార్క్‌లో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించగా, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రులు ఏకనాథ్ షిండే, సునేత్ర పవార్ పాల్గొన్నారు. ఇటీవలే సచిన్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ వివాహానికి ఆశా భోంస్లే హాజరైన విషయం ఈ సందర్భాన్ని మరింత భావోద్వేగభరితంగా మార్చింది.




.png&w=3840&q=75)

















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!